Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్విషాదం..గణేష్ నిమజ్జనానికి వెళ్లిన తండ్రి-కొడుకులు మృతి

విషాదం..గణేష్ నిమజ్జనానికి వెళ్లిన తండ్రి-కొడుకులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దుండిగల్‌లో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన తండ్రి-కొడుకులు అదృశ్యమై మృతదేహాలుగా బయటపడ్డారు. వివరాల ప్రకారం, దుండిగల్‌కు చెందిన శ్రీనివాస్ తన కుమారుడితో పాటు వెస్లీ కాలనీ వాసులతో కలిసి ఆటోలో గణేష్ నిమజ్జనానికి వెళ్లారు. నిమజ్జనం పూర్తి చేసుకున్న తర్వాత కాలనీ వాసులు ఇంటికి చేరుకున్నారు. అయితే శ్రీనివాస్, అతని కుమారుడు మాత్రం తిరిగి రాలేదు. ఇంటికి రాకపోవడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీసులను సంప్రదించారు. చెరువు పరిసరాలను పరిశీలించిన పోలీసులు, అక్కడ రాయి చిందరవందరగా కనిపించడంతో ఆటో చెరువులో పడిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, తండ్రి-కొడుకుల మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad