- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నంద్యాల జిల్లాలో గురువారం దారుణ ఘటన జరిగింది. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన పాలను తాగించి చంపాడు. ఆ తరువాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులను వేములపాటి సురేంద్ర (35), కావ్యశ్రీ (7), ధ్యానేశ్వరి (4), సూర్య గగన్ (2) లుగా గుర్తించారు. సురేంద్ర భార్య మహేశ్వరి (32) గతేడాది ఆగస్టు 16న అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



