Thursday, January 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనాన్నా !... దేశం సురక్షితమైన చేతుల్లోనే వుంది

నాన్నా !… దేశం సురక్షితమైన చేతుల్లోనే వుంది

- Advertisement -

– మా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తాం
– జాతీయ అసెంబ్లీలో కన్నీటి పర్యంతమైన కుమారుడు గుయర్రా
కారకస్‌:
వెనిజులాలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు నికొలస్‌ మదురో కుమారుడు, ఆ దేశ పార్లమెంటు సభ్యుడు నికొలస్‌ మదురో గుయర్రా సోమవారం జాతీయ అసెంబ్లీలో తన తల్లిదండ్రుల కిడ్నాప్‌ గురించి మాట్లాడుతూ, అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీటిపర్యంత మయ్యారు. వెనిజులాపై సాయుధ దురాక్రమణకు దిగిన అమెరికా, మదురోను ఆయన భార్యను కిడ్నాప్‌ చేసి న్యూయార్క్‌కు తరలించిన రెండు రోజుల తర్వాత వెనిజులా నేషనల్‌ అసెంబ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా సభలో గుయర్రా మాట్లాడుతూ, వెనిజులా నాయకత్వం పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్‌కు మద్దతుగా వుంటామని పునరుద్ఘాటించారు. తక్షణమే కిడ్నాపైన నేతలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ సమావేశంలో తన తండ్రిని ఉద్దేశించి నేరుగా మాట్లాడుతూ గుయర్రా, ”నాన్నా ..మీరు మన కుటుంబంలో ప్రతి ఒక్కరినీ చాలా శక్తివంతంగా తయారుచేశారు. మీరు తిరిగి వచ్చేవరకు ఇక్కడ ప్రతీ ఒక్కరూ వారి వారి విధులను, దేశం పట్ల బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. త్వరలోనే స్వంత దేశంలోనే మనం కలుసుకోబోతున్నాం.” అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ”ప్రస్తుతం మన మాతృభూమి సురక్షితమైన చేతుల్లోనే వుంది. మన మాతృభూమికి ఏది అవసరమో అది చేయడానికి మనందరం ధృఢంగా నిలబడదాం. మీ అందరినీ అమితంగా ప్రేమిస్తున్నా”…. అంటూ ‘లాంగ్‌ లివ్‌ వెనిజులా లాంగ్‌ లివ్‌ హోంల్యాండ్‌’ అని నినదించారు. కాగా మరోవైపు ఇదే రోజు న్యూయార్క్‌ కోర్టులో మదురో దంపతులు విచారణకు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -