- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో అనుమానంతో తండ్రి సుర్జిత్ సింగ్ తన 17 ఏళ్ల కూతురి చేతులు కట్టి కాలువలోకి తోసేశాడు. రెండు నెలల తర్వాత ఆ బాలిక తిరిగి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన బాలిక, అనారోగ్యం కారణంగా తిరిగి రాలేకపోయానని, తలకు గాయం వల్ల కొన్ని విషయాలు గుర్తులేవని తెలిపింది. అరెస్ట్ అయిన తన తండ్రిని విడుదల చేయాలని, ముగ్గురు చెల్లెళ్లకు తండ్రి అవసరమని పోలీసులను ప్రాధేయపడింది.
- Advertisement -



