Wednesday, November 26, 2025
E-PAPER
Homeక్రైమ్మార్కులు తక్కువొచ్చాయని తండ్రి మందలింపు…

మార్కులు తక్కువొచ్చాయని తండ్రి మందలింపు…

- Advertisement -

– అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య
– హబ్సిగూడ కాకతీయనగర్‌లో ఘటన
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ

మార్కులు తక్కువ వచ్చాయనీ, తండ్రి మందలిం చడంతో ఓ బాలిక మనస్తాపంతో అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధి హబ్సిగూడలో జరిగింది. ఓయూ ఎస్‌ఐ కరుణాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడ కాకతీయనగర్‌కు చెందిన కె.సుకుమార్‌ రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆయన భార్య, కూతురు సిరివైష్ణవి(15), కుమారుడు వార్విన్‌రెడ్డితో కలిసి నివాసముంటు న్నాడు. వైౖష్ణవి హబ్సిగూడ శ్రీచైతన్య స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు గణితంలో తక్కువ మార్కులు వచ్చాయి. దాంతో తండ్రి ఆమెను మందలించి.. మంచి భవిష్యత్‌ కోసం కష్టపడి చదవాలని సూచించాడు. దాంతో తీవ్ర మనోవేదనకు, ఒత్తిడికి గురైన వైష్ణవి మంగళవారం తెల్లవారుజామున వారుండే అపార్ట్‌మెంట్‌ 4వ అంతస్తు టెర్రాస్‌ పైనుంచి కిందకు దూకింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గమనించిన ఆమె తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -