విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదు. అందులో పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ఇమిడి ఉంటుంది. దీన్ని గుర్తించడంలో అలక్ష్యం వహిస్తే అది వారి జీవితాలనే ఛిద్రం చేస్తుంది. దేశంలో కొంత కాలంగా పెరిగిన విద్యార్థుల మరణాలను గమనిస్తే ఈ విషయం స్పష్టం గా బోధపడుతుంది. అందుకే సుప్రీంకోర్టు ఇటీవల ఓ కేసులో విద్యార్థుల మరణాల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ”నేర్చు కోవడంలో ఆనందం పోయి, ర్యాంకులు, ఫలితాలు, నిరంతరపోటీ ఆందోళనగా మారి పోయింది’ అని వ్యాఖ్యానించింది. ఏపీలోని కోచింగ్ సెంటర్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతిఘటనలో పుర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం పైవిధంగా స్పందించింది. అయితే ఇది ఒక్క విద్యార్థికి సంబంధించిన అంశంగా కాకుండా, భావిభారత పౌరులు ఎదుర్కొంటున్న సమస్యగా పరిగణించింది. ఆత్మహత్యల నివారణకు పదిహేను సూత్రాల ప్రణాళికను ప్రకటించింది. దీన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కోచింగ్ కేంద్రాలనే తేడా లేకుండా అందరూ అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. కాస్తా ఆలస్యమైనా కోర్టు తీర్పు పట్ల నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. కానీ, కార్పొరేట్ వ్యవస్థ, కేంద్ర పాలకవర్గం చెట్టా పట్టా లేసుకుని తిరుగుతున్న తరుణంలో ఇది అమలవు తుందా? అన్న సందేహం రాకమానదు. కానీ దీనికి బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే.
ఈ పోటీ ప్రపంచంలో నేడు విద్యార్థులను మనుషు లుగా కాకుండా ర్యాంకులుగా చూస్తున్న మాట వాస్తవం. లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వారిని మార్కుల కోసం ఒత్తిడి చేస్తూ మానసిక ఊబిలోకి నెట్టేస్తున్నారు. తెలిసీతెలియని పసి మనసులు ఆ ఒత్తిడిని భరించలేక అర్ధాంతరంగా తనువులు చాలిస్తు న్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన పదిహేడేండ్ల విద్యార్థిని విషయంలో ఇదే జరిగింది. నీట్ ప్రిపరేషన్ కోసం విశాఖపట్నంలోని కోచింగ్ సెంటర్‌లో చేరిన ఆమె 2023 జులై 14న రాత్రి హాస్టల్ మూడోఅంతస్తు నుంచి పడి అనుమానాస్పదంగా చని పోయింది. ఈ ఘటన పట్ల పోలీసులు సీరి యెస్‌గా స్పందించలేదు. అవసరమైన పద్ధతిలో విచారణ కూడా చేపట్టలేదు. తమ కూతురు మరణానికి కారణమేంటని యాజ మాన్యాన్ని నిలదీసిన తండ్రికి సరైన సమాధానం దొరకలేదు. దీంతో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన హైకోర్టు ను ఆశ్రయించాడు. అక్కడా న్యాయం జరక్కపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విద్యా ర్థుల మానసిక స్థితిపై ఆందో ళన వ్యక్తం చేసింది. కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వానికి సూచించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, జీవించే హక్కు పరిధిలో మానసిక ఆరోగ్యం అంతర్భాగమని చెబు తున్నది. దీన్నిబట్టి చూస్తే విద్యార్థుల ఆరోగ్యానికి మాన సిక రక్షణ ఉండటం, వారు ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా చూడటం ప్రభు త్వాల బాధ్యత. కానీ, ఆ దిశగా అడుగులు వేయడంలో చిత్తశుద్ధి లోపించింది. దేశ అభివృద్ధిలో కీలకంగా పనిచేసే విద్య, అందులో యువత భవిష్యత్తు ఇలా నిర్వీర్యమవుతుంటే పట్టించుకోకపోవడం పాలక వర్గాల నిర్లక్ష్యానికి నిదర్శనం. జాతీయ నేర గణాంక సంస్థ- 2022 నాటి ”యాక్సి డెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా” నివేదిక కూడా విస్తు బోయే విషయాల్ని వెల్లడించింది. భారత్‌లో ఆత్మహత్య చేసుకున్న వారిలో అత్య ధికం 7.6శాతం విద్యార్థులేనని పేర్కొంది. 2022లో పదమూడు వేల మందికి పైగా ఉసురు తీసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆత్మ హత్య చేసుకున్న వారిలో 2,248 మంది కేవలం పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లేనని తెలిపింది. అది ఇప్పుడు రెట్టింపు అయినట్టు సర్వేల ద్వారా తెలుస్తోంది. మరి ఈ మరణాలకు బాధ్యులెవరు? ఆలోచించాలి.
తల్లిదండ్రులు కూడా ‘నీవు కలెక్టర్ కావాలి. పోలీస్ ఆఫీ సర్ కావాలి’ అంటూ వారి ఆలోచనలను పిల్లల మెదళ్లపై రుద్దుతారు.ఇంకా ఎదుటివారిని పోల్చుతూ ‘నీకు ర్యాంకెం దుకు రాలేదు?పైసలు దండగ’ అంటారు. ఇది చాలా తప్పని సైకాలజిస్టుల అభిప్రాయం. పిల్లలను వారిని ఇష్టమైన కోర్సులో చేర్పించడం దగ్గరినుంచి వారి మనోభావాలకు భంగం వాటిల్లకుండా చూడటం, భావోద్వేగాలను తగ్గట్టుగా నడవడం, ఫెయిలైతే వెన్ను తట్టడం లాంటివి చేస్తే ఆత్మ హత్య ల్ని అరికట్టే అవకాశముంది. అసలు విద్యార్థుల సమస్యల్ని విద్యాసంస్థలు పట్టించుకోకపోవడం, ఆ నిర్లక్ష్యం వల్ల ఆత్మ హత్యకు దారితీస్తే, ఆ సంస్థలే బాధ్యత వహించాలని ధర్మా సనం గట్టిగానే మందలించింది. కానీ యాజమాన్యాలు, ప్రభు త్వాలు పట్టించుకుంటే కదా! కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కు కున్న విద్యావ్యవస్థ, దానికి వత్తాసు పలికే అధికార యంత్రాం గం ఇప్పటివరకు ఈ మరణాలను ఆపింది లేదు. మరి సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కనువిప్పు కలుగుతుందా? చూడాలి. అలా జరగని పక్షంలో పౌరసమాజమే ప్రభుత్వాలు, విద్యాసంస్థలపై ఒత్తిడి తేవాలి. తమ పిల్లల పై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.ఇది భావి భారతానికి చాలా ముఖ్యం.
భావి భారతం..బలన్మరణం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES