విశాఖకు 560 కి.మీ దూరంలో కేంద్రీకృతం
17కి.మీ వేగంతో కదులుతున్న తుపాను
కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షాలు
వందకు పైగా రైళ్లు రద్దు
అమరావతి: ‘మొంథా’ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన 6 గంటల్లో 17 కి.మీ వేగంతో కదిలిన తుపాను.. ప్రస్తుతం చెన్నైకి 480కి.మీ, కాకినాడకి 530కి.మీ., విశాఖపట్నానికి 560 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళ వారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. రేపు రాత్రికి కాకినాడ సమీపం లో తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఈ సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమ త్తంగా ఉండాలని జైన్ ప్రకటనలో పేర్కొ న్నారు.మరోవైపు సముద్రంలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి.
కోనసీమ జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు
తాజా పరిస్థితుల నేపథ్యంలో కోనసీమ కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తుపానును ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. జిల్లా సముద్రతీర ప్రాంతం 30కి.మీ పరిధిలో ఉన్న ప్రజల కోసం 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ సాయంత్రం నుంచి పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి భోజన వసతి, చిన్నారులకు పాలు పంపిణీ చేస్తామ న్నారు. తుపాను తీరం దాటేవరకు ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.
100కి పైగా రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుపానుగా మారడంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తొలుత ఈస్ట్‌కోస్ట్ రైల్వే రద్దు చేయగా.. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 27, 28, 29, 30 తేదీల్లో రద్దు చేసిన పలు రైళ్లకు సంబంధించిన జాబితాను అధికారులు సంబంధిత ‘ఎక్స్’ ఖాతాల్లో పోస్టు చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దైన రైళ్ల జాబితాలో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ మెము, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.
విజయవాడ పరిధిలో 54 రైళ్లు రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్..!
తుపాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రైల్వేశాఖ ముందస్తుగా పలు రైళ్లు రద్దు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు.
మొంథా భయం
- Advertisement -
- Advertisement -



