Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి

- Advertisement -

విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం
బకాయిలు ఇవ్వకుంటే చలో హైదరాబాద్‌
మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం
ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ
30న విద్యాసంస్థల, వర్సిటీల
బంద్‌ జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో

రాష్ట్రంలో ఆంండ్ల నుంచి పెండింగ్‌ ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం కనీసం రూ.1200 కోట్లు అయినా విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఫార్మసి, మెడికల్‌, ఇతర ప్రొఫెషనల్‌ విద్యాసంస్థలు, యూనివర్సిటీల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఎస్వీకేలో సోమవారం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.రజనీకా ంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆంండ్ల నుంచి సుమారు రూ.8 వేల కోట్లకుపైగా ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు కనీసం వారు ఇచ్చిన టోకెన్ల నిధులు కూడా ఇవ్వలేదని వాపోయారు. విద్యాసంస్థల యాజామన్యాలు బంద్‌ ప్రకటించి సంవత్సరం కాలంగా పోరాడితే రూ.1200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని, లక్షలాది రూపాయలు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఫీజుల చెల్లింపు కోసం గ్యారంటీ ఇచ్చి.. భవిష్యత్‌ నష్టపోకుండా చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తన వద్దే విద్యాశాఖను అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. నవంబర్‌ మొదటి వారంలో బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటామని అన్నారు. విద్యపై ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం వల్లే.. రాష్ట్రంలో విద్యారంగం ఆగమాగం అవుతోందని అన్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం బకాయిలు, డైట్‌, కాస్మోటిక్‌ చార్జీలు బకా యిలు, ఫీజులు బకాయిలపై సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగం సమస్యలపై సమీక్ష చేయా లన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలలో డైట్‌ చార్జీలు విడుదల చేయలేదని, వర్సిటీలు అభివృద్ధికి దూరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సమస్యల పరిష్కారా నికి ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యసంస్థలు, ప్రొఫెషనల్‌ విద్యాసంస్థలు, యూనివర్సిటీల బంద్‌ నిర్వహిస్తున్నామని, ఈ బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత, రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్‌, లెనిన్‌, హైదరాబాద్‌ జిల్లా నాయకులు నాగేందర్‌, స్టాలిన్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -