Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి

- Advertisement -

అంబేద్కర్ విగ్రహానికి అధ్యాపకుల వినతి 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రయివేట్ కళాశాలల అధ్యాపకులు మంగళవారం నిరసన తెలిపారు. సాగర్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యం కళాశాలలను నడపలేకపోతుందని తెలిపారు. తాము ఎన్నో ఏళ్లుగా కళాశాలలో నమ్ముకుని విద్య బోధన చేస్తున్నామని ఫీజు రీయింబర్స్మెంట్ రాని కారణంగా మాకు జీతాలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. దీనివలన మా కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండడం వల్ల జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి మా జీవితాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధు, శ్రీనివాసు, ప్రభాకర్, యాదయ్య, దుర్గయ్య, హరికృష్ణ, రమేష్, రాజారామ్, వెంకట సతీష్, జ్యోతి, సైదమ్మ, స్వామి, సైదాచారి, వెంకటయ్య, వీరయ్య, వాసు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -