లోకంలో ప్రేమలన్నీ పెనం మీద నీళ్లవుతున్నరు
బంధాలన్నీ బరువెక్కి భారమవుతున్నరు పలకరింపులు చేదరు ముఖము తిప్పుకుంటున్నరు కలిసి ఉండే మనుషులు కులగోడలల్ల ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతాండ్లు
ఒకప్పుడు లోకం పెద్దగా కనిపించేది
ఇప్పుడు అరచేతిలో అగుపిస్తాంటే
పెద్దగెట్లనిపిస్తది?
కాలు కదపకుండా
కళ్ళతో చూసి మురిసిపోయే లోకమాయే
అన్నీ తెలుసనే బ్రమలో బ్రతుకుతూ
అర్థం లేని వ్యర్ధ జీవితాలను జీవిస్తున్నరు
అహాన్ని ప్రదర్శిస్తూ ఆగమవుతున్నరు.
ఇప్పుడు..
మనసులు గెలిచే మాటలు లేవు
కడుపు నింపే చేతులు లేవు బాధలో భరోసానిచ్చే కండ్లు లేవు
ఆపదల్లో ఆదుకునే హస్తాలులేవు
ఆప్యాయతలు ఆగుపిస్తలేవు అనురాగాలు రోగాలను నయం చేస్తలేవు
అసూయ ద్వేషాలు పెరిగిపోతున్నరు
కోపం కొరివై సెగలు కక్కుతాంది
మంచితనం మాట వరసకైనా కనబడకుండ
అంతరంగంలో దాగి అంతరించిపోతాంది !!
పక్షులకున్న ఐక్యత.. జంతువులకున్న ఐక్యత.. మనుషుల మధ్య లేకుండా పోయింది
ఒంటరైయ్యింది..!
- Advertisement -
- Advertisement -


