నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో సబ్సిడీపై విత్తనాలు పొందిన మద్నూర్ గ్రామ రైతులకు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజు నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకం కింద డి.ఎస్.బి 34 రకం సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించి రైతులకు సోయాబీన్ పంటల మీద ప్రస్తుత పంట యాజమాన్య పద్ధతుల గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఏరువాక కేంద్రం శాస్తవ్రేత్త అనిల్ రెడ్డి సోయాబీన్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు సూచించడం జరిగింది.ఈకార్యక్రమంలో ఎఫ్ పి ఓ చైర్మన్ చట్లవార్ గోపాల్, ఏఈ వో సౌమ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.