Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంభీకర దాడులు.. 224 మంది మృతి!

భీకర దాడులు.. 224 మంది మృతి!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇటీవల ప్రారంభించిన దాడుల వ‌ల్ల‌ ఇప్పటివరకు కనీసం 224 మంది మరణించారని, వీరిలో 90 మందికి పైగా సాధారణ పౌరులున్నారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అంతర్జాతీయ సమాజం ఈ హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.
‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఈనెల 13న‌ ఇజ్రాయెల్ ఈ దాడులను ప్రారంభించింది. ఇరాన్‌లోని పన్నెండుకు పైగా ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని సమాచారం. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్-సయీద్ ఇరవానీ భద్రతా మండలిలో ప్రసంగిస్తూ, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ దాడుల వలన 224 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 329 మందికి పైగా గాయపడ్డారని ఆయన తెలిపారు.
ఈ దాడుల్లో పలువురు ఇరాన్ ఉన్నత సైనిక అధికారులు కూడా మరణించారు. ఇరానియన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ బాఘేరి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)కు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు, ఐఆర్‌జీసీ వాయు రక్షణ, డ్రోన్ విభాగాల నాయకులు మృతి చెందిన వారిలో ఉన్నారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ దళానికి చెందిన కీలక నాయకత్వం అంతా ఒక భూగర్భ కమాండ్ సెంటర్‌లో ఉండగా, దానిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని, ఫలితంగా వారంతా మరణించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad