Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమరోసారి బీజాపూర్‌ అడవుల్లో భీకర పోరు

మరోసారి బీజాపూర్‌ అడవుల్లో భీకర పోరు

- Advertisement -

నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో మళ్లీ మావోయిసు ్టలు, భద్రతా బలగాలకు మధ్య బీకర పోరు జరిగింది. బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. నేషనల్‌ పార్క్‌ ఏరియాలో మావోయి స్టులు సంచారం ఉందనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టగా.. మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగా యి. ఈ కాల్పుల్లో.. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు ఆడేలు అలియా స్‌ భాస్కర్‌ మృతి చెందాడు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పోచరా ఆయన స్వస్థలం. ఆయనపై 25 లక్షల రివార్డు ఉన్నట్టు ఎస్పీ వివరించారు. ఘటనాస్థలి లో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, డీఆర్‌జీఎస్‌టీఎఫ్‌, కోబ్రా, జవాన్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపా రు. ఏడీజీ వివేకానంద సిన్హా, బస్తర్‌ ఐజీ పి.సుందర్‌ రాజ్‌, సీఆర్‌పీఎఫ్‌ ఐజీ రాకేష్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img