537 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు
రూ.8 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం : రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మూడు విడుతలుగా సాగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో నేడు నిర్వహించనున్న తొలి దశ పోలింగ్‌కు యాభై వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 3,800 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరగనుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు 537 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న వివిధ వర్గాల నుంచి నగదు, ఇతర వినియోగ వస్తువులను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు.
వాటి విలువ రూ.8.20 కోట్లని ఆయన తెలిపారు. 1000 మందికి పైగా అవాంఛనీయ సంఘటనలు సృష్టిస్తారనే వారిని బైండోవర్ చేశామని, ఆయుధ లైసెన్స్ కలిగిన వారి నుంచి ఆయుధాలను కూడా స్థానిక పోలీస్ స్టేషన్‌లలో డిపాజిట్ చేయించామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ సంఘటనలకు సంబంధించి 218 ఎఫ్‌ఐఆర్‌లను నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను కూడా రంగంలో దించామని, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు గస్తీ నిర్వహంచనున్నారని తెలిపారు. పోలింగ్‌కు అవాంతరాలు సృష్టించేవారు ఎవరైనా వదిలిపెట్టమని, ప్రజలు ప్రశాంతంగా పోలింగ్‌లో పాల్గొనాలని శివధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తొలిదశ పోలింగ్‌కు యాభై వేల మంది పోలీసులతో బందోబస్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



