- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలో ట్యూషన్‌లో ఇద్దరి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నాసిక్‌లో శనివారం సాయంత్రం ఓ ట్యూషన్ సెంటర్‌లో తరగతులకు టెన్త్ విద్యార్థులు హాజరయ్యారు. ఓ బెంచ్ సీటు కోసం ఇద్దరు టెన్త్ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ తీవ్రంగా కొట్టుకోవడంతో యశ్రీరాజ్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న సత్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -