Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసామినేని స్ఫూర్తితో రైతాంగ సమస్యలపై పోరాటం

సామినేని స్ఫూర్తితో రైతాంగ సమస్యలపై పోరాటం

- Advertisement -

– సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్యే
జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం
రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి. సాగర్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌

సామినేని రామారావు స్ఫూర్తితో రైతాంగ సమస్యలపై ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి.సాగర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సామినేని రామారావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతాంగ సమస్యలపై నిస్వార్ధంగా పనిచేసిన రామారావును కాంగ్రెస్‌ గుండాలు అక్టోబర్‌ 30న హత్య చేశారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. 12 రోజులవుతున్నా ఇప్పటివరకు దోషులను అరెస్టు చేయలేదని, ఇది ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటి వనరుల నిర్మాణం, మార్కెట్లో కనీస మద్దతు ధరల అమలుకై జరిగిన పోరాటాల్లో రామారావు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అనేక కేసులు పెట్టినప్పటికీ పట్టువదలని నాయకునిగా ఉద్యమాలను కొనసాగించారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రంలో అనేక భూ సమస్యలు, ఇరిగేషన్‌, మార్కెట్‌, బ్యాంకులు, విద్యుత్‌ సమస్యలను రామారావు పరిష్కరించారని అన్నారు. రామారావు మృతి రైతు ఉద్యమానికి తీరనిలోటన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి, కందాల ప్రమీల, పి. జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, మాదినేని రమేశ్‌, వర్ణ వెంకటరెడ్డి, శెట్టి వెంకన్న, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్‌ శోభన్‌, అన్నవరపు సత్యనారాయణ, బొంతు రాంబాబు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాటూరి బాలరాజ్‌, ఈసంపల్లి బాబు, ఎం. శ్రీనివాస్‌, వెంకటేశ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -