Saturday, July 5, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్సుమారు రెండు నెలలు మృత్యువుతో పోరాటం

సుమారు రెండు నెలలు మృత్యువుతో పోరాటం

- Advertisement -

-25 లక్షలు ఖర్చు చేసిన ప్రాణం నిలువలే 

-దశదినకర్మలో 10 వేలు ఆర్థిక సహాయం చేసిన గ్రామస్తులు 

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గుడి సత్యం (36 ) ఏప్రిల్ 29 న రాత్రి సమయంలో బైక్ పై కల్వకుర్తి వెళ్తున్న తరుణంలో పోల్కంపల్లి కొండారెడ్డిపల్లి రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్ప రాత్రి కనబడక జరిగిన బైకు ప్రమాదంలో సత్యం తీవ్రంగా గాయపడ్డాడు.గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ సహాయంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ లోని చింతకుంట్ల నాసా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఒక నెల 15 రోజులు అక్కడ ట్రీట్మెంట్ అందించారు అనంతరం పరిస్థితి విషమించడంతో జూన్ 15 న ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అక్కడ 12రోజులు మృత్యువుతో పోరాడి జూన్ 27న చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.పేదింటి వారైనా స్థోమతకు మించి 25 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. శనివారం దశదిన కర్మ కావడంతో భార్య అరుణకు గ్రామస్థులు 10 వేలు ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు.మృతునికి ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ మండల ప్రెసిడెంట్ బోడ శేఖర్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి,రేనయ్య యాదవ్,మల్లయ్య యాదవ్ తదితరులు  కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -