Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకాళేశ్వరం మోటార్లతో రిజర్వాయర్లు నింపండి

కాళేశ్వరం మోటార్లతో రిజర్వాయర్లు నింపండి

- Advertisement -

– ఉత్తమ్‌కు హరీశ్‌రావు లేఖ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌
కాళేశ్వరం మోటార్లను ఆన్‌చేసి రిజర్వాయర్లు నింపాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం ఈమేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. రిజర్వాయర్లల్లో నీటిని సకాలంలో నింపకపోవడం వల్లే పంటల సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌ రిజర్వాయర్లను నింపి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకెజ్‌-6 వద్ద గల మోటార్లను ఆన్‌ చేసి నీటి పంపింగ్‌ చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన వచ్చే ప్రతి నీటిచుక్కని ఒడిసి పట్టడం కోసం సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌లను ఆన్‌ చేయాలని రైతుల పక్షాన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad