Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండో విడత సర్పంచ్ పదవి అభ్యర్థుల తుది జాబితా విడుదల

రెండో విడత సర్పంచ్ పదవి అభ్యర్థుల తుది జాబితా విడుదల

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్ 
మండలంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితా ఎన్నికల అధికారులు శనివారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం నిజాంసాగర్ మండలంలో 14 గ్రామ పంచాయతీలకు గాను 13 గ్రామ పంచాయతీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. మొత్తం 37 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ చేయనున్నారు. మండలంలోని మల్లూరు తాండ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మండలంలో 122 వార్డు మెంబర్లకు గాను 101 వార్డ్ మెంబర్లు ఎన్నికలకు సిద్ధమయ్యారు. అందులో 21 వార్డ్ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 202 మంది అభ్యర్థులు వార్డు మెంబర్ ఎన్నికలకు సిద్ధమయ్యారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -