Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్71వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు తుది జట్లు ఎంపిక

71వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు తుది జట్లు ఎంపిక

- Advertisement -

నిజామాబాద్ జిల్లా మహిళా, పురుషుల క్రీడాకారులు..
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

ఈనెల 23 ,24 న అసిఫాబాద్ జిల్లా గోలేటి లో జరిగే 71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా , పురుషుల బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ కు నిజాంబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తుదిజట్టును ఎంపిక చేశారు అని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిజామాబాద్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో పురుషులకు, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మోర్తాడ్ లో మహిళల క్రీడాకారులకు సన్నత శిబిరాన్ని నిర్వహించి తుది జట్టును ఎంపిక చేయడం జరిగింది.

ఎంపికైన క్రీడాకారులు నిజాంబాద్ జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారు. పురుషుల విభాగంలో ఆనంద్, కార్తీక్, సాయి కుమార్, సాయి శివ, వంశీ, శివ మహేష్, పండరి, వెంకటేష్, సాయినాథ్, హర్షిత్, మహిళలు విభాగంలో పూజిత ,స్ఫూర్తి, హర్షిత ,రితిక ,స్ఫూర్తి, సన్నిధి, వైష్ణవి ,నవీన, శ్రీనిధి, తబ్బుసo,‌ ఈ ఎంపిక కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేష్, వ్యామ ఉపాధ్యాయులు హరీష్, పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad