- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే జీవితకాల కనిష్టానికి పతనమవుతోంది. రూపాయి విలువ 90.70-91 మార్క్ కు తాకనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని, ఇలాంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని వింతభాష్యం చెప్పారు. ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడారు.
- Advertisement -



