నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి ప్రకాష్ గౌడ్ కు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేసిన రూ.72వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కును గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఎంతగానో దోహదపడుతూ భరోసాని ఇస్తుందన్నారు. వైద్యం కోసం అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్థిక సహాయం చెక్కు చెక్కు మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారుడు ప్రకాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్, వార్డు మెంబెర్లు సాదుల్లా, అజయ్ గౌడ్, నాయకులు బద్దం తిరుపతి రెడ్డి, సుంకరి విజయ్ కుమార్, మారుపాక నరేష్, బండి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.



