నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో రాంపూర్ అభ్యుదయ కాలనీలో గత పది రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి శ్రావ్యంజలి మహిళా పొదుపు సంఘం రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు. బుధవారం 10 రోజుల క్రితం పసర రాంపూర్ అభ్యుదయ కాలనీలో విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్ధమై పోవడంతో బాధిత కుటుంబాన్ని కుటుంబానికి శ్రావ్య అంజలి మహిళా సంఘాల ద్వారా ఆ గ్రూపులో ఉన్న మహిళ అయినా వ్యక్తి తిక్క శ్రీదేవి, రవిలకు రూ.5000 ఆర్థిక సాయం అందించారు. మహిళా సంఘాలు అందించిన ఆర్థిక సహాయానికి గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు అధికారులు అభినందనలు తెలిపారు. ఈ ఆర్థిక సహాయంతో బాధిత కుటుంబానికి భరోసా కల్పించినట్లు అవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అగ్ని ప్రమాద బాధితునికి రూ.5 వేల ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



