నవతెలంగాణ-నిజాంసాగర్
మండలంలోని మాగి గ్రామంలో మీకోసం మేము సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవలే అనారోగ్యంతో చిన్న వయస్సులోనే మరణించిన కొల్ల పండరి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, మొత్తం 38 మంది యువకులు స్పందించి రూ.17,600 విరాళం అందజేయడం జరిగింది అని మాగి అభయాంజనేయ క్షేత్ర ఆలయ ధర్మకర్త మెంగారం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అని గ్రామంలోని యువతలో ఐక్యత, సేవాభావం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆపదలో తోడు నిలవడం, బాధలో ఉన్నవారికి అండగా నిలవడం మనిషి చేసే అత్యున్నత సేవ అని ఆయన అన్నారు.
ఇప్పటివరకు మీకోసం మేము సేవా సమితి ద్వారా మాగి గ్రామంలో దాదాపు 12 పేద కుటుంబాలకు చావు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించగలిగామని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ యువత ఏక శక్తితో ముందుకు వస్తే ఏ ఆపదనైనా ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కొల్ల సంగయ్య, చింతకింది సాయిలు, కొల్ల శ్రీనివాస్, కొల్ల దుర్గయ్య, కోర్కంటి నగేష్, పెద్దల శేఖర్, చింతకింది నాగరాజు, మెంగారం జైపాల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES