Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంబీబీఎస్ సీటు సాధించిన పేద ఇంటి విద్యార్ధినికి ఆర్థిక సహాయం

ఎంబీబీఎస్ సీటు సాధించిన పేద ఇంటి విద్యార్ధినికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ఎల్లయ్య మార్తమ్మ దంపతుల కుమార్తె సబిత నీట్ పరీక్షలొ ఉత్తమ ర్యాంకు సాధించి సిద్దిపేట ఆర్విఎం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఎల్లయ్య మార్తమ్మ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. చాలా పేద కుటుంబం కావడంతో వారి కుమార్తె సబితకు మెడికల్ కళాశాలలో చేర్పించడానికి ఆర్థిక సహాయం అందించాలని దాతలను కోరడంతో వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు వెంటనే స్పందించి ఎంబిబిఎస్ కళాశాలలో చేరడానికి కావలసిన ఆర్థిక సహాయం 40 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సైదులు గౌడ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరశేఖర్  జర్నలిస్టు షేక్ ఆరిఫ్, మచ్చా వెంకటేశ్వర్లు, సైదా హుస్సేన్, కానిస్టేబుళ్లు ఒగ్గు వెంకటేశ్వర్లు వీరాంజనేయులు జేఎల్ఎం రాగ్యా నాయక్, ఆర్ఎంపీ వైద్యులు ఓర్సు శ్రీనివాస్ గ్రామ పెద్దలు చిలుక విద్యాసాగర్ సామాజిక కార్యకర్త ఫర్వేజ్ ఎలిమినేటి అంజి రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -