లేబర్ కార్డులను రెన్యువల్ చేసుకోవాలి
నవతెలంగాణ – చిన్నకోడూరు
పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నాని బాబు మేస్త్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో మంగళవారం మృతుని కుటుంబానికి చిన్నకోడూరు మండలం భవన నిర్మాణ కార్మికులు మండల అధ్యక్షుడు చెరుకు నారాయణ ఆధ్వర్యంలో భార్యకు రూ.10000 అర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్డులు లేని కార్మికులు లేబర్ కార్డు తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. నిజ జీవితంలో మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో మన కుటుంబాన్ని రోడ్డున పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కార్డుతో పాటు లేబర్ కార్డు తీసుకొని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని కోరారు.
మృతునికిఇద్దరు కూతుర్లు, కుమారుడు చిన్నపిల్లలు కావడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మండలంలో 47 మంది కార్మికులు 2019 నుండి 2026 వరకు మృతి చెందడం జరిగిందని వారందరి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం మండల నాయకులు జి., శంకరయ్య ఏం లింగం,సిహెచ్ రాజు, ఆర్ నరసయ్య,బి లింగం,జి భూమయ్య, మహంకాళి ఎల్లం, అనంతసాగర్ భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు మెట్ల వేణు సంఘ సభ్యులు పాల్గొన్నారు.



