Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెయింటర్ కుటుంబానికి ఆర్థిక సహాయం 

పెయింటర్ కుటుంబానికి ఆర్థిక సహాయం 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
పెయింటర్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచామని పెయింటర్ల సంఘం మండల గౌరవ అధ్యక్షులు గాదపాక భాస్కర్ తెలిపారు. పాలకుర్తి గ్రామానికి చెందిన పెయింటర్ గాయాల సతీష్ ఇటీవలే మరణించడంతో శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి పెయింటర్ల యూనియన్ ఆధ్వర్యంలో సతీష్ కుటుంబానికి పెయింటర్ల సంఘం మండల అధ్యక్షుడు ఇరుగు అశోక్ తో కలిసి రూ.10000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. పెయింటర్లలో ఏ సభ్యునికి ఎలాంటి సమస్య ఏర్పడిన పెయింటర్లు ఐక్యమత్యంతో ఆదుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెయింటర్ల సంఘం మండల కోశాధికారి గ్యార సురేష్,  మండల ప్రచారణ కర్త పాలడుగు ప్రశాంత్  సీనియర్ పెయింటర్ గాదపక మల్లేష్, గాయల రవి, తూటి పరుశరాములు, గాదెపాక కుమార్,  గాదెపాక హరీష్, వంగాల అశోక్,  బండిపల్లి  కృష్ణ, గాదపాక ఎల్లేష్,  యాటల మహేష్, గాయల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -