Monday, July 14, 2025
E-PAPER
Homeఆటలుజాప్యం ఎందుకో తేల్చండి!

జాప్యం ఎందుకో తేల్చండి!

- Advertisement -

భారత బాక్సింగ్‌ సమాఖ్యకు ఐఓఏ కమిటీ
న్యూఢిల్లీ:
భారత బాక్సింగ్‌ సమాఖ్య (బిఎఫ్‌ఐ) ఎన్నికల జాప్యానికి గల కారణాలను తేల్చేందుకు, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ తయారు చేయాలని భారత ఒలింపిక్‌ సంఘం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ విషయాన్ని బీఎఫ్‌ఐ తాత్కాలిక ప్యానెల్‌ ఆదివారం ఒక ప్రకటనలో ధవీకరించింది. ముగ్గురితో సభ్యుల ఐవోఏ కమిటీకి కోశాధికారి సహదేవ్‌ యాదవ్‌ అధ్యక్షతన వహించనుండగా, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు భూపేందర్‌సింగ్‌ భాజ్వా, అడ్వకేట్‌ పాయాల్‌ కాక్రా సభ్యులుగా ఉన్నారు. ‘ప్రస్తుత బీఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ గడువు ఫిబ్రవరి 2వ తేదీతో ముగిసినా, ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఐఓఏ నియమిత కమిటీ ఎన్నికల ప్రక్రియకు ఎక్కడ అంతరాయం ఏర్పడింది, అందుకు గల కారణాలు, పరిష్కారాలపై నివేదిక ఇవ్వనుందని ‘ ఐఓఏ అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -