సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఘటన
నవతెలంగాణ-దుబ్బాక
పాత ఇనుప సామాను దుకాణం (స్క్రాప్)లో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడి బజార్‌లో వ్యాపారి పర్వతం పూర్ణచందర్ స్క్రాబ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా స్క్రాబ్ దుకాణంలో వెనకవైపు శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ ఉన్న పాత సామగ్రి, ప్లాస్టిక్ పైపులు, రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు అంటుకొని ఆ ప్రాంతమంతా పొగతో నిండుకుంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. కాగా, రూ.15 వేల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



