Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రీకృష్ణ సీసీఐ గోదాంలో అగ్నిప్రమాదం

శ్రీకృష్ణ సీసీఐ గోదాంలో అగ్నిప్రమాదం

- Advertisement -

రూ.60కోట్ల నష్టం
సీసీఐ అధికారులు, ఏసీపీ లక్ష్మీనారాయణ పరిశీలన
నవతెలంగాణ-కొత్తూరు

రంగారెడ్డి జిల్లా నంది గామ మండల కేంద్రం వీర్లపల్లి రోడ్డులోని శ్రీకృష్ణ సీసీఐ గోదాంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో పత్తి పూర్తిగా దగ్ధమై పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. షాద్‌ నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సీసీఐ సర్టిఫైడ్‌ చేసిన శ్రీకృష్ణ పరిశ్రమకు సంబంధించిన గోదాంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని భారీమొత్తంలో నిల్వ ఉంచారు. ఈ క్రమంలో శనివారం ఒక్కసారిగా మంటలు అంటుకుని పత్తి మొత్తం దగ్ధమైంది.

వెంటనే గోదాం నిర్వాహకులు పోలీసులకు, ఫైర్‌స్టేషన్‌కి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ, సీఐ ప్రసాద్‌ పరిశీలించారు. అయితే, గోదాంలో పవర్‌ సరఫరా లేదని, రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సీసీఐ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.60కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -