Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మీర్‌చౌక్‌లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంటలు సంబవించే సమయంలో ఆ భవనంలో నాలుగు కుటుంభాల్లోని 30 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది 14 మందిని కాపాడారు. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో.. లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల ఇంకా 16 మంది ఉండడంతో 10 ఆంబులెన్సులను ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. రెస్క్యూ చేయబడిన వారిలో ఏడుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ముగ్గురు చిన్నారులు సహా 14 మంది ఉన్నారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad