Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుగుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సర్కార్

గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సర్కార్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చార్మినార్‌ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 17 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img