Friday, April 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘స్పిరిట్’ సెట్‌లో అగ్నిప్రమాదం..

‘స్పిరిట్’ సెట్‌లో అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రెబెల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ సెట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్రీకరణ జరుగుతుండగా సెట్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రభాస్ సెట్‌లో లేకపోవడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో యూనిట్ సభ్యులలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. అగ్నిప్రమాదం వల్ల సెట్‌లో వేసిన కొన్ని టెంట్లు, షూటింగ్‌కు సంబంధించిన పరికరాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిసింది. అయితే, పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊరట చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -