రూ.8000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఫైర్ ఆఫీసర్
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
నల్లగొండ అగ్నిమాపక అధికారి కార్యాలయంలో దీపావళికి ముందే బాంబులు పేల్చారు. జిల్లా అగ్ని మాపక అధికారి కార్యాలయంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వేమిరెడ్డి సత్యనారాయణరెడ్డి నల్లగొండ పట్టణంలో కాకర్స్ తాత్కాలిక దుకాణం ఏర్పాటు కోసం యజమాని వద్దనుండి ఎల్ ఓ సి కోసం 10,000 డిమాండ్ చేశాడు. యజమానికి రూ.8000 కు ఒప్పందం చేసుకున్నాడు. రూ.8000 ఆ అధికారి ఎన్జీ కళాశాలలో యజమాని వద్ద నుండి తీసుకొని టూ వీలర్ కవర్లో పెట్టుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ అండ్ గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర మాట్లాడుతూ.. అధికారిని అదుపులోకి తీసుకొని కార్యాలయంలో రికార్డులు పరిశీలించామని తెలిపారు. దానితోపాటు అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించి శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక అధికారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES