నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా నుంచి మొదటి బ్యాచ్ హెలికాప్టర్లు భారత్ లోని హిందోన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నాయి. 2020 ఫిబ్రవరిలో యునైటెడ్ స్టేట్స్ మధ్య సుమారు $600 మిలియన్ల (సుమారు ₹5,691 కోట్లు) విలువైన ఒప్పందం కుదిరింది. దీని కింద భారత ఆర్మీ కోసం ఆరు AH-64E అపాచీ హెలికాప్టర్లను సమకూర్చాలని నిర్ణయించారు. మొదటి బ్యాచ్ (మూడు హెలికాప్టర్లు) 2024లో డెలివరీ కావాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా ఈ డెలివరీ డిసెంబర్ 2024 కి వాయిదా పడింది. అయితే, ఈ సవరించిన గడువు కూడా దాటిపోయింది. చివరగా ఈ రోజు మూడు హెలికాఫ్టర్లు భారత్ చేరుకున్నాయి. ప్రత్యేక విమానంలో అపాచీ హెలికాఫ్టర్లను భారత్ తీసుకొచ్చారు. ఇవి సోవియట్ రూపకల్పన ఆధారిత ఆంటోనోవ్ An-124 కార్గో విమానంలో అమెరికాలోని ఆరిజోనాలోని మెసా నుంచి భారత్‌కు రవాణా చేశారు. ఈ హెలికాప్టర్లు జోధ్‌పూర్‌లోని నగ్తలావ్‌లోని 451 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్‌లో ఉంచుతారు. భారత అర్మీ బోయింగ్ AH-64E అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే.
మొదటి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు భారత్‌కు రాక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES