నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ తొలి రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత నెలకొంది. సభను ఉద్దేశించి సీఎం మమతా బెనర్జీ ప్రారంభ ఉపన్యాసం చేస్తుండగా బీజేపీ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి, సీఎం మమతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అది కాస్త తీవ్రరూపం దాల్చి అధికార, విపక్ష ఎమ్మెల్యేల మధ్య దాడికి దారి తీసింది.ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో గొడవ మరింత ముదిరింది. వెంటనే స్పందించిన అసెంబ్లీ మార్షల్స్ బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు లాక్కెల్లారు.
అనంతరం సీఎం మమత మాట్లాడుతూ.. బీజేపీ అవినీతి, ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ బందిపోట్ల పార్టీ అని.. దేశంలో కొనసాగే అర్హత ఆ పార్టీకి లేనే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.