Wednesday, November 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంతొలి మానవ సహిత ప్రయోగం విజయవంతం

తొలి మానవ సహిత ప్రయోగం విజయవంతం

- Advertisement -

అంతరిక్షంలోకి దూసుకెళ్లిన
చైనా షెన్‌జౌ-22 నౌక

బీజింగ్‌ : చైనా షెన్‌జౌ-22 అంతరిక్ష నౌక ప్రయోగం విజయవంతమైంది. దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమ చరిత్రలో ఇది మొదటి అత్యవసర ప్రయోగంగా గుర్తింపు పొందింది. వాయువ్య చైనాలోని జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి మంగళవారం షెన్‌జౌ-22 అంతరిక్షంలోకి దూసుకెళ్లిందని చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ(సీఎంఎస్‌ఏ) తెలిపింది. లిఫ్ట్‌ ఆఫ్‌ అయిన కొన్ని నిమిషాల తర్వాత, షెన్‌జౌ-22 అంతరిక్ష నౌక లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ నుంచి విజయవంతంగా విడిపోయి దాని ప్రణాళికాబద్ధమైన కక్ష్యలోకి ప్రవేశించిందని సీఎంఎస్‌ఏ ప్రకటించింది. షెన్‌జౌ-22 అంతరిక్ష నౌక పూర్తిగా సరుకుతో నిండి ఉంటుంది. వీటిలో కక్ష్యలో ఉన్న టైకోనాట్‌లకు ఆహారం , అంతరిక్ష కేంద్రం కోసం పరికరాలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -