- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
తెలంగాణ ప్రభుత్వం గాంధారి మండల కేంద్రంలో క్రీడ మైదానానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఇచ్చిన మాట ప్రకారం గాంధారి యువతకు క్రీడా మైదానానికి స్థలం కేటాయించినందుకు గాంధారి మండల ప్రజలు యువకుల తరఫున ఎమ్మెల్యే మదన్మోహన్ కు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తూర్పు రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మండలంలో అనేక అభివృద్ధి పనులు మదన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఆయన అన్నారు.
- Advertisement -