Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఇజ్రాయిల్ దాడిలో ఐదుగురు జ‌ర్న‌లిష్టులు మృతి

ఇజ్రాయిల్ దాడిలో ఐదుగురు జ‌ర్న‌లిష్టులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో ప్ర‌ముఖ మీడియా సంస్థ విలేఖ‌రులు మృతి చెందారు.అల్‌-షిఫా ఆసుపత్రి మెయిన్‌ గేట్‌ బయటకు ఉన్న ప్రెస్‌ టెంట్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసిందని అల్‌ జజీరా మీడియా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. అందులో ఐదుగురు తమ పాత్రికేయులేనని పేర్కొంది. అల్‌ జజీరా కరస్పాండెంట్స్‌ అనాస్ అల్‌ షరీఫ్‌, మహమ్మద్‌ ఖ్రీకె, కెమెరామెన్‌లు ఇబ్రహీం జహీర్‌, మోమెన్‌ అలివా, మహ్మద్‌ నౌఫల్‌ మరణించినట్లు సంస్థ తెలిపింది.

ఈ దాడులు జరిగిన కాసేపటి తర్వాత ఇజ్రాయెల్‌ మిలిటరీ దీనిపై ప్రకటన చేసింది. అల్‌ జజీరాలో చేరి జర్నలిస్టు ముసుగులో ఇజ్రాయెల్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని ఐడీఎఫ్‌ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. మరోవైపు, ఈ దాడిపై పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img