Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ కేసులో ఐదుగురు అరెస్టు

డ్రగ్స్‌ కేసులో ఐదుగురు అరెస్టు

- Advertisement -

నిందితుల్లో ఒకరు ఏ ఆర్‌ కానిస్టేబుల్‌..?
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ఘటన


నవతెలంగాణ-మియాపూర్‌
గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ తీసుకుంటున్న వ్యక్తులను ఈగల్‌, సైబరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గచ్చిబౌలి సీఐ బాలరాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన గచ్చిబౌలి పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి, డ్రగ్స్‌ తీసుకుంటున్న ఐదుగురిని అరెస్ట్‌చేసి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించినట్టు తెలిపారు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మసీద్‌ బండలోని కోవ్‌ స్టేస్‌లో ఓ రూమ్‌లో మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారంతో ఈగల్‌ ఫోర్స్‌.. గచ్చిబౌలి పోలీసులతో కలిసి దాడి నిర్వహించింది. ఆ సమయంలో ఏడుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ కనిపించారు. అక్కడ మత్తు పదార్థాలుండటంతో వారికి టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ వచ్చింది. దాంతో వారిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో హైదారబాద్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కూడా ఉన్నట్టు సమాచారం. వినియోగించినట్టు తేలింది. డ్రగ్స్‌ తీసుకున్న మేఘేందర్‌, తేజేశ్వర్‌, సాయి ప్రసాద్‌, రమేష్‌, టి.రవిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు 2019లో హైదరాబాద్‌లో హౌటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ కలిసి చదువుకున్న వారుగా గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -