Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహైద‌రాబాద్ లో ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

హైద‌రాబాద్ లో ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన ఘటన ఉప్పల్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఈ నెల 12న రామంతాపూర్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బిహార్‌కు చెందిన కమర్‌ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారిస్తే సమీపంలోని ముళ్ల పొదల్లో లైంగిక దాడి చేసి, హత్య చేసినట్టు అంగీకరించాడు. శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని గాంధీకి తరలించినట్టు చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad