- Advertisement -
నవతెలంగాణ – సదాశివపేట
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సదాశివపేట పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసింది. ఈ సందర్భంలో డి.ఎస్.పి ఏ. సత్తయ్య ఆధ్వర్యంలో, సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేష్‌తో పాటు బందోబస్తు సిబ్బందితో కలిసి విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఓటర్లలో విశ్వాసం కలిగించడం, ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడం మరియు ఎన్నికలను సజావుగా నిర్వహించడం లక్ష్యంగా సదాశివపేట మండలంలోని అరూర్, ఆత్మకూర్ గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అనుచిత సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -



