– ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా, కోచ్‌ల నియామకంపై కొరవడిన స్పష్టత
– స్టేడియాలు, స్పోర్ట్స్ స్కూళ్ల ఆధునీకరణపై దషి పెట్టండి :
శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్పోర్ట్స్ పాలసీ లోపభూయిష్టంగా ఉందని శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీలకు క్రీడాకారులను సన్నద్ధం చేసేందుకు అవసరమైన హైపెర్ఫామెన్స్ అకాడమీల స్థాపనపై స్పోర్ట్స్ పాలసీలో కనీస ప్రస్థావన లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు, ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారికి నేరుగా ఉద్యోగాలిచ్చే విధానంపై పాలసీలో కానరాకపోవడం విచారం వ్యక్తం చేశారు. ప్ర స్తుతం శాట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కోచ్‌ల క్రమబద్ధీకరణ, కొత్త కోచ్‌ల నియామకం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కోచింగ్ వ్యవస్థను బాగు చేయకుండా రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేయలేరని అన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ అనే అంశం ఐరావతంలా మారిందని, విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఒక బ్లూ ప్రింట్ తయారు చేయకుండా ప్రకటనలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. క్రీడలకు భారీ బడ్జెట్ కేటాయించామని ప్రచారానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని స్టేడియాలు, స్పోర్ట్స్ స్కూళ్ల ఆధునీకరణపై తక్షణమే దష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. మండల స్థాయిలో టాలెంట్ హంట్ నిర్వహించి, వారిలో ప్రతిభావంతులను జిల్లాల్లోని ఫీడర్ సెంటర్లలో ప్రాథమిక తర్ఫీదు ఇచ్చి, హైదరాబాద్‌లోని హైపెర్ఫామెన్స్ సెంటర్లలో పెట్టి ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చేలా ఒక కోచింగ్ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ఈ మూడంచెల కోచింగ్ విధానంతో రాష్ట్రం స్పోర్ట్స్ హబ్ గా మారుతుందని అన్నారు. పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెరిగినందున స్పోర్ట్స్ స్కూల్‌లో సీట్లు పెంచే ఆలోచన కూడా చేయాలని కోరారు.
లోపభూయిష్టంగా స్పోర్ట్స్ పాలసీ
- Advertisement -
- Advertisement -