Saturday, March 7, 2026
E-PAPER
Homeమానవిజుట్టు ఆరోగ్యానికి.. అవిసె గింజల ప్యాక్‌!

జుట్టు ఆరోగ్యానికి.. అవిసె గింజల ప్యాక్‌!

- Advertisement -

అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మం, కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో జుట్టు, కుదుళ్ల ఆరోగ్యానికి అవిసె గింజల హెయిర్‌ప్యాక్‌ ఉపయోగపడుతుందంటున్నారు.
అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మం, కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో జుట్టు, కుదుళ్ల ఆరోగ్యానికి అవిసె గింజల హెయిర్‌ప్యాక్‌ ఉపయోగపడుతుందంటున్నారు.
కావాల్సినవి : అవిసె గింజలు : ఒక కప్పు
నీళ్లు : ఆరు కప్పులు, కొబ్బరి నూనె : ఐదు టీస్పూన్లు,
తయారీ : ఒక కప్పు అవిసె గింజలకు ఆరు కప్పుల నీళ్లు చేర్చి బాగా మరిగించాలి. నీళ్లు సగానికి రాగానే స్టౌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఆ నీళ్లు జెల్‌లా మారతాయి. ఇప్పుడు ఒక పల్చటి శుభ్రమైన క్లాత్‌ తీసుకొని, ఆ మిశ్రమాన్ని వడగట్టాలి. దీనికి ఐదు టీస్పూన్ల కొబ్బరి నూనెను చేర్చి బాగా కలపాలి.

ఎలా వాడాలి..?
హెయిర్‌ ప్యాక్‌ వేసుకునే ముందు జుట్టు శుభ్రంగా, పొడిగా ఉండాలి. జుట్టుని సన్నని పాయ లుగా విడదీస్తూ, హెయిర్‌ ప్యాక్‌ కోసం తయారు చేసుకున్న జెల్‌ని కుదుళ్ల నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. నెమ్మదిగా మునివేళ్లతో ఒక పది నిమిషాల పాటు కుదుళ్లను మసాజ్‌ చేసి, గంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ హెయిర్‌ ప్యాక్‌ జుట్టు పెరగడానికి తోడ్పడటమే కాకుండా హెయిర్‌ కండిషనర్‌గానూ పని చేస్తుందంటున్నారు నిపుణులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -