Thursday, November 6, 2025
E-PAPER
Homeజిల్లాలుతెలంగాణ జేవీవీ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు 

తెలంగాణ జేవీవీ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు 

- Advertisement -

మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య
నవతెలంగాణ – పాలకుర్తి

విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్ సృజనాత్మకతను వెలికి తీసి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 2025 చెకుముకి సైన్స్ సంబరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో జన విజ్ఞాన వేదిక కన్వీనర్లు తాళ్లపెళ్లి నీలకంఠం, జె శ్రీహరి లతో కలిసి చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ ..ఈనెల 7న నేడు పాఠశాల స్థాయిలో, 21న మండల స్థాయిలో, 28న జిల్లాస్థాయిలో, డిసెంబర్ 12 నుండి 14 వరకు రాష్ట్రస్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం, సైన్స్ ప్రగతి కోసం, సైన్స్ స్వాలంబన కోసం సైన్స్ అంటూ గత కొన్ని సంవత్సరాల నుండి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాని నాయక్ ,బాలాజీ ,కొండయ్య ,జ్ఞాన కుమారి, జసిoతారాణి, సుగుణ దేవి ,మంజుల, కవిత పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -