రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్షాల డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
వరద నష్టాన్ని వెంటనే చెల్లించాలి అని రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఇటీవల ఉమ్మడి జిల్లాలో వచ్చిన అకాల వర్షాలు వరదల కారణంగా రైతులు సాధారణ ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారని వాపోయారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అయినా కామారెడ్డి లో మాత్రం గత 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు పడనంత వర్షపాతం 48 డిగ్రీలకు పైగా కురిసిందని దాని మూలంగా ఆ ప్రాంతంలో అనేక చెరువులు కట్టలు తెగి నీరు ఉప్పొంగిందని తెలిపారు.
కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం అంత భారీ వర్షం లేకున్నా నిజాంసాగర్ నుండి 2 లక్షల 50 వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వదలడంతో పాటు, మంజీరాకు పెద్ద ఎత్తున వరదరావడంతో దాని ప్రభావంతో గోదావరి కూడా వరద పెరిగి వాటి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల రైతుల పంట నీటిలో మునిగి నష్టం జరిగిందన్నారు. అదే విధంగా మంది రైతుల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతోపాటు సిరికొండ ,ధర్పల్లి ,వేల్పూర్ , భీమ్గల్ మండలాల పరిధిలో చెరువులు, వాగులు బట్టలు తెగటంతో పాటు పంట పొలాల్లో ఇసుకమేటలు పేరుకుపోయాయని తెలిపారు. వరద నీటితో ఇండ్లలోకి బురద మట్టి పేరుకుపోయి నిత్యవసర సరుకులు అన్ని పాడైపోయాయని అన్నారు.
జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరగడంతో పాటు ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణలో సంభవించిన ఈ వరదల నష్టానికి జాతీయ విపత్తుగా ప్రకటించి రూ.10వేల కోట్ల ఆర్థిక సహకారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అందుకు ఈ జిల్లా నుండి ఎంపికైన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా నుంచి ఎన్నికైన బిజెపి శాసనసభ్యులు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. అదేవిధంగా అదేవిధంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి కేంద్రం రూ.25000 రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేల చొప్పున చెల్లించాలని అన్నారు.
ఇళ్లల్లో బురద పేరుకుపోయిన ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. నిరుపేదలైన ప్రతి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహకారం ఇవ్వాలని అన్నారు. చెడిపోయిన రోడ్లను, వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం సిపిఐయు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ జిల్లా నాయకులు రఘురామ్, సిపిఐ జిల్లా నాయకులు రఘురాం ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రైతు సిఐటియు జిల్లాసంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్,ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, ఎస్.ఎస్.ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేశ్, రాజు, చక్రి, అంజయ్య, అబ్దుల్, రాములు తదితరులు పాల్గొన్నారు.
వరద నష్టాన్ని వెంటనే చెల్లించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES