నవతెలంగాణ-హైదరాబాద్: ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజులుగా వానాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో తాజాగా భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. సోమవారం నాటికి 46.30 ఇక్క మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. మరో పక్క ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి కొనసాగుతుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి దగ్గరలో ప్రవాహం ఉంది. ప్రస్తుతం ఇక్కడ 13.10 అడుగుల మేర ప్రవాహం ఉంది. బ్యారేజ్ 175 గేట్లను పైకి లేపు సముద్రం లోకి 11,79,236 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాగు సాగు నీటి అవసరాల నిమిత్తం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భద్రాచలానికి తగ్గిన వరద ఉధృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES