- Advertisement -
నవతెలంగాణ – శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్నది. దీంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో 1,69,044 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,47,195 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.50 అడుగులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.0439 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
- Advertisement -