- 14 గేట్ల ద్వారా నీటి విడుదల
నవతెలంగాణ-నాగార్జునసాగర్
శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీరు పెరుగుతూ ఉండటంతో ఆదివారం సాయంత్రానికి నాగార్జునసాగర్ 14 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 1,46,339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 1,66,993 క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుకుంటుండగా ప్రస్తుతం సాగర్ జలాశయంలో 589.70 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువ ద్వారా 9500 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ ద్వారా 8454 క్యూసెక్కులను, ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 3373 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులు.. మొత్తంగా సాగర్ జలాశయానికి వచ్చింది వచ్చినట్టుగా 1,66,993 క్యూసెక్కులను బయటికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలంకు ఎగువ నుంచి 1,07,407 క్యూసెక్కులు వస్తుండగా శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు పది అడుగుల మేరకు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 884.30 అడుగులుగా ఉంది.