26 గేట్లు ఎత్తి నీటి విడుదల
నవతెలంగాణ-నాగర్జున సాగర్
నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీరు భారీగా పెరగడంతో శనివారం సాయంత్రం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి 2,81,352 క్యూసెక్కుల నీరు వస్తుండగా సాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 2,09,794 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. జలాశయం నుంచి కుడి కాలువ ద్వారా 9019 క్యూసెక్కులు, జన్మక్కల ద్వారా 6325 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32,764 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 2,24,166 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 884.10 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్‌కు పెరిగిన వరద నీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES